Varanasi Movie Update
* 90 శాతానికి పైగా పూర్తైన షూటింగ్..
* 2027 ఏప్రిల్ 7న విడుదల
ఆకేరు న్యూస్, సినిమా: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో దసరా సందర్భంగా మేకర్స్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే ‘వారణాసి’ నుంచి విడుదలైన కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మహేశ్ బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా టైమ్ ట్రావెల్, యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
* దాదాపు పూర్తైన షూటింగ్
తాజా సమాచారం ప్రకారం ‘వారణాసి’ షూటింగ్ 90 శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు తనకు సంబంధించిన కీలక సన్నివేశాల్లో ఎక్కువ భాగం పూర్తి చేసినట్లు సమాచారం. మిగిలిన షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు రాజమౌళి టీమ్ ప్రయత్నిస్తోంది.
* దసరాకు స్పెషల్ గ్లింప్స్?
ప్రస్తుతం దసరా అప్డేట్పై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడం, సినిమాపై భారీ హైప్ ఉండటంతో దసరా సందర్భంగా కొత్త పోస్టర్, స్పెషల్ గ్లింప్స్ లేదా మరో ప్రమోషనల్ అప్డేట్ను విడుదల చేసే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ‘వారణాసి’ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న రాజమౌళి.. సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
