Mahadevpur Gas Godown Protest
* గ్యాస్ గోదాం తరలింపుపై బీఆర్ఎస్ నిరసన
అకేరు న్యూస్, భూపాలపల్లి: మహాదేవపూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న జీసీసీ గ్యాస్ గోదాంను భూపాలపల్లికి తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. గోదాం తరలింపు వల్ల కాటారం డివిజన్ పరిధిలోని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
* దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి
మహాదేవపూర్‌లో గ్యాస్ గోదాం కొనసాగితే చుట్టుపక్కల మండలాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని నాయకులు తెలిపారు. ఇప్పటికే మారుమూల ప్రాంతాల ప్రజలు గ్యాస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, గోదాంను భూపాలపల్లికి తరలిస్తే అదనపు ప్రయాణ భారం పడుతుందని పేర్కొన్నారు.
* నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్యాస్ గోదాంను మహాదేవపూర్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తరలింపు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించాలని కోరారు. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో మాజీ సర్పంచ్ శ్రీపతి బాపుతో పాటు కేదారి గీత, ఎండీ అలీమ్ ఖాన్, పోత వెంకటస్వామి, కలికోట దేవేందర్, తోట సుధాకర్, అన్నమనేని అరుణ, స్వప్న, అడప మల్లయ్య తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
