Saharanpur Youth Attack
* వైరల్గా మారిన దాడి వీడియో
ఆకేరు న్యూస్, ఉత్తరప్రదేశ్: వివాహితను కలవడానికి రాత్రివేళ ఆమె ఇంటికి వెళ్లిన ఓ యువకుడిని కుటుంబ సభ్యులు పట్టుకుని దారుణంగా కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మిర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 11.30 గంటల సమయంలో యువకుడు మహిళ ఇంటికి వెళ్లగా కుటుంబ సభ్యులు పట్టుకున్నారు.
అతడిని తాళ్లతో కట్టి తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. అనంతరం చెక్క దూలానికి కట్టేసి దాడి చేశారు. ఈ ఘటనను ఓ వ్యక్తి మొబైల్లో చిత్రీకరించాడు. ఘటన జరిగిన సుమారు పది రోజుల తర్వాత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని యువకుడిని స్టేషన్కు తరలించారు. అప్పట్లో ఇరువర్గాల మధ్య రాజీ జరగడంతో లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని సమాచారం. ప్రస్తుతం వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు ఘటనలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటనలో యువకుడి వద్ద నుంచి రూ.5 లక్షలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దీనిపై పోలీసులు లేదా విశ్వసనీయ వర్గాల నుంచి అధికారిక ధృవీకరణ లేదు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
