Tortoise Song 10 Million Views
* తొలి పాటకే మిలియన్ల వ్యూస్..
* పెరుగుతున్న అంచనాలు
* అనూప్ రూబెన్స్ మెలోడీ మ్యాజిక్
ఆకేరు న్యూస్, సినిమా: హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న ‘టార్టాయిస్’ సినిమా మ్యూజికల్‌గా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘నీ పరిచయం..’ పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ సాంగ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
* తొలి పాటకే భారీ స్పందన
‘టార్టాయిస్’ నుంచి విడుదలైన తొలి పాటే ఈ స్థాయిలో ఆదరణ పొందడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అందమైన మెలోడీ ట్యూన్‌తో ఈ పాటను రూపొందించారు. ప్రేమికుల భావాలను ప్రతిబింబించేలా ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ సాహిత్యం అందించారు. సింగర్ చిన్మయి తన స్వరంతో పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు.
* ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘టార్టాయిస్’
స్పెన్స్, డ్రామాతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘టార్టాయిస్’ తెరకెక్కుతోంది. రిత్విక్ కుమార్ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ తరుణ్ సరసన అమృత చౌదరి నటిస్తుండగా.. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, షిజు ఏఆర్, రవి కాలె, మొయిన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మానస కుమార్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
సినిమాటోగ్రఫీని శబరి విగ్నేష్, సంగీతాన్ని అనూప్ రూబెన్స్, ఎడిటింగ్‌ను గుళ్లపల్లి మాధవ్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా దేవర మధుకర్ పనిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ‘నీ పరిచయం..’ సాంగ్‌కు వచ్చిన 10 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ‘టార్టాయిస్’పై మరింత ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
