Vinayaka Chavithi Celebrations at Hanamkonda
ఆకేరు న్యూస్, హన్మకొండ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హన్మకొండలోని కనకదుర్గ కాలనీ, అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
* వేడుకల్లో పాల్గొన్న కడియం, నాయిని..
ఈ వేడుకల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులతో కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. బొజ్జ గణపయ్య కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ప్రతి ఏటా కాలనీవాసులు, నగర ప్రజలు ఐకమత్యంతో, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని కడియం శ్రీహరి అన్నారు. భక్తులు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.
వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో పాటు సోదరభావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
