Palakurthi|
Palakurthi: ఆకేరు న్యూస్, పాలకుర్తి: పాలకుర్తి బస్‌స్టాండ్ ఆవరణలో తక్షణమే నాణ్యమైన సీసీ రోడ్లు నిర్మించాలని ఐప్వా మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనంతోజు రజిత డిమాండ్ చేశారు.
బస్‌స్టాండ్ ఆవరణను పరిశీలించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కనీసం సీసీ రోడ్లు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే ఆవరణలో నీరు నిలిచి గుంతలు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీంతో ప్రయాణికులు, స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
నిల్వ నీటితో దోమలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. వందలాది మంది రాకపోకలు సాగించే బస్‌స్టాండ్‌లో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
బస్‌స్టాండ్ పరిధిలో వెంటనే సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు నిల్వ నీటిని తొలగించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు, పార్టీ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
