Mahesh Kumar Goud
* కేసీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ సూచన
Mahesh Kumar Goud: ఆకేరు న్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రతిపక్ష నేతగా చేయాలని సూచించారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, అలాంటప్పుడు తలసానికి ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగించాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తలసానిని మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్‌పై..
అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్‌పైనా మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. బీఆర్ఎస్ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరుతామని తెలిపారు.
కొండా సురేఖపై స్పందన
మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిచిందన్న ప్రచారంపైనా ఆయన స్పందించారు. కొండా సురేఖను హైకమాండ్ పిలిచినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.
22A అంశంపై కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో 22A అంశంపై కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. 22A కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం జరగకూడదని అన్నారు. అవసరమైతే చట్టంలో మార్పులు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతున్నట్లు తెలిపారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించే అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, సామాన్యుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
