AP CM Ganesh Chaturthi
AP CM Ganesh Chaturthi: ఆకేరు న్యూస్, అమరావతి: వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. సతీమణి నారా భువనేశ్వరి, మనవడు దేవాంశ్, ఇతర కుటుంబసభ్యులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇంట్లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహానికి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబసభ్యులు పూజలు నిర్వహించారు. గణేశుడికి పుష్పాలు, పత్రి సమర్పించడంతో పాటు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు గణనాథుడిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
