SRR Foundation
SRR Foundation: ఆకేరు న్యూస్, రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో గణేష్ మండపానికి ఎస్ఆర్ఆర్ (SRR) ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రూ.50 వేల సొంత ఖర్చుతో శాశ్వత రేకుల షెడ్డును నిర్మించి ఇచ్చారు. మండల కేంద్రంలోని మైలారం ప్రభుత్వ పాఠశాల పక్కన నిర్మించిన ఈ షెడ్డును సోమవారం శ్రీనివాస్ రెడ్డి తన తల్లిదండ్రులు పరుపాటి సరోజన, యాదవరెడ్డితో కలిసి ప్రారంభించారు.
యువత విజ్ఞప్తికి వెంటనే స్పందన
మైలారం గ్రామ యువత గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు, శాశ్వత షెడ్ నిర్మాణానికి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. దీనిపై ఆయన వెంటనే స్పందించి రూ.50 వేలతో షెడ్ నిర్మాణ పనులను పూర్తి చేయించారు. దీంతో గ్రామ ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆపదలో అండగా నిలుస్తున్న శ్రీనివాస్ రెడ్డి
రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో అనారోగ్యం, ప్రమాదాలు, ఇతర ఆపదల సమయంలో బాధిత కుటుంబాలకు శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం అందిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న ఆయన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో లేతకుల రంగారెడ్డి, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, పరుపాటి రవీందర్ రెడ్డి, గూడెల్లి వెంకటయ్య, బెల్లి అనూష, బొమ్మినేని సురేందర్ రెడ్డి, చిర్రా బిక్షపతి, సంకినేని ఎల్లస్వామి, బాధ సుధాకర్, పట్టపురం బిక్షపతి, రంగు కుమార్, బోయిని ముని, కోల సిద్దు, బైరి రమేష్ బాదరవి, ఎనగందుల మహేందర్, పిడుగు అశోక్, పిడుగు వెంకన్నతో పాటు స్థానిక యువత, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
