Shamshabad Bus Accident
Shamshabad Bus Accident: ఆకేరు న్యూస్, హైదరాబాద్: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. సుమారు 50 మంది గాయపడినట్లు సమాచారం.
ఇద్దరి పరిస్థితి విషమం
ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
హోటల్లోకి దూసుకెళ్లిన బస్సు
బస్సు ఒక్కసారిగా హోటల్లోకి దూసుకెళ్లడంతో అక్కడ ఉన్నవారిలో తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రమాదంతో హోటల్ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ అతివేగం లేదా నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
