Chandrababu Tirumala Tour
Chandrababu Tirumala Tour: ఆకేరు న్యూస్, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు, ఎల్లుండి తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శ్రీవారి దర్శనం చేసుకోవడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
రేపు సాయంత్రం తిరుపతికి చేరుకోనున్న చంద్రబాబు అనంతరం తిరుమలకు వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం బేడి ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు.
సెప్టెంబర్ 16న తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్, గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద ఈవీ బస్సులు, ఎస్వీ మ్యూజియంను ప్రారంభించనున్నారు.
అలాగే తిరుమలలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తిరుమల అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, రద్దీ నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు సీఎం పర్యటించే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు.
రెండు రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం సెప్టెంబర్ 16న మధ్యాహ్నం చంద్రబాబు ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
