Warangal Ganja Seized
* నలుగురు బీహార్ వ్యక్తుల నుంచి 250 గ్రాముల గంజాయి
* 139 గంజాయి చాక్లెట్లు స్వాధీనం
ఆకేరు న్యూస్ ,వరంగల్ : వరంగల్‌లో మిల్స్ కాలనీ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించారు. శాఖరాశికుంట ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నలుగురు బీహార్‌కు చెందిన వ్యక్తుల వద్ద గంజాయిని గుర్తించి పట్టుకున్నారు.
పోలీసుల తనిఖీల్లో వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయి, 139 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికి విక్రయించేందుకు తరలిస్తున్నారు? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.
గంజాయి (Warangal Ganja Seized ) సరఫరా వెనుక ఉన్న వ్యక్తులు, నెట్‌వర్క్‌పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
