Kadiyam Srihari
* ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గ్రామస్తుల వినతి
Malkapur Lak: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు మల్కాపూర్ చెరువును దేవాదుల (గోదావరి) జలాలతో నింపాలని చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామస్తులు కోరారు. ఈ మేరకు హనుమకొండలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
మల్కాపూర్ చెరువును దేవాదుల జలాలతో నింపితే గ్రామంలోని రైతులకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీటి సమస్య కూడా కొంతవరకు తీరుతుందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సానుకూలంగా స్పందించడంతో వారు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉప సర్పంచ్ పశుల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు రవి, కుమారస్వామి, కుమార్, నాయకులు ఎడవెల్లి మల్లారెడ్డి, రవి, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
