Rakesh Reddy Resignation Statement
* నిజామాబాద్ జిల్లాపై చిన్నచూపా
* కొడంగల్‌కు నిధులు.. మాకేవి?
* “లెక్కలు చెప్పి రాజీనామా చేస్తా”..
* ఆర్మూర్ ఎమ్మెల్యే సంచలనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ వేదికగా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం చూపుతున్న వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, అవసరమైతే తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.
* ఆఫీసులు కూలిపోయే స్థితిలో ఉన్నాయి..
ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్డీవో, ఎంఆర్వో కార్యాలయాల భవనాలు నిజాం కాలం నాటివని, దాదాపు 100 ఏళ్ల నాటి పాత భవనాల్లో నడుస్తున్నాయని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. సబ్ కలెక్టర్ ఆఫీస్, ఎంఆర్వో ఆఫీసులు క్లర్క్ స్థాయి అధికారి కూర్చునేలా చాలా చిన్నగా, కూలిపోయే స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిగి ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం దాదాపు రెండేళ్లుగా ముఖ్యమంత్రికి, రెవెన్యూ శాఖ మంత్రికి విన్నవిస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు.
*నిజామాబాద్ జిల్లా అంటే చిన్నచూపా..
ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని రాకేష్ రెడ్డి మండిపడ్డారు. ఇతర నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌ల కోసం ₹27 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తమ ప్రాంతానికి వచ్చేసరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. “కొడంగల్‌తో పాటు మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిధులు తీసుకెళ్తున్నారు? మా నియోజకవర్గానికి, మా జిల్లాకు ఎన్ని నిధులు ఇచ్చారో నా దగ్గర పూర్తి చిట్టా ఉంది” అని స్పష్టం చేశారు.
* అన్ని లెక్కలు తేల్చి రాజీనామా చేస్తా..
సభ ముగిసే సమయానికి (చివరి 10 నిమిషాల్లో) తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు, కేటాయింపులపై పూర్తి లెక్కలు సభ ముందు ఉంచి, తన ప్రాంత సమస్యలు పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
