CM Revanth Reddy
* రైతులకు సీఎం రేవంత్ కీలక హామీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో పోడీ (సబ్‌డివిజన్) భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శాసనసభలో రైతుల భూ సమస్యలపై జరిగిన చర్చ సందర్భంగా ఈ అంశంపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరించారు.
సర్వే చేసి విభజన
ఒకే సర్వే నంబర్లో భూమి ఉన్న రైతుల మధ్య సరిహద్దులు స్పష్టంగా లేకపోవడం వల్ల భూ వివాదాలు, రిజిస్ట్రేషన్ల సమస్యలు ఏర్పడుతున్నాయని సీఎం తెలిపారు. వారసత్వంగా భూములు బదిలీ అయినా, అన్నదమ్ముల మధ్య పంపకాలు జరిగినా పోడీ నమోదు పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేక మెకానిజం
రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేసి సబ్‌డివిజన్ ప్రక్రియను పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. డిజిటల్ సర్వే, సరిహద్దుల నిర్ధారణ, భూ రికార్డుల నవీకరణ ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
పోడీ పూర్తయితే రైతులకు రుణాలు, ప్రభుత్వ పథకాలు, పంట నష్టపరిహారం పొందడంలో ఇబ్బందులు తగ్గడంతో పాటు భూముల రిజిస్ట్రేషన్లలోనూ సమస్యలు తొలగే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
