CPM Telangana
CPM Telangana: ఆకేరు న్యూస్, పాలకుర్తి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య పిలుపునిచ్చారు.
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని వీరనారి ఐలమ్మ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభ కరపత్రాన్ని బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన యోధుల ఆశయాలను ప్రజా ఉద్యమాల ద్వారా కొనసాగిస్తామని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు తెలంగాణకు గర్వకారణమన్నారు.
ఈ నెల 17న జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం హాజరవుతారని తెలిపారు. సభకు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, సీపీఎం శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు సోమ సత్యం, మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, ముస్కు ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
