Ranabaali
Ranabaali: ఆకేరు న్యూస్, సినిమా: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ఇండియా చిత్రం ‘రణబలి’ షూటింగ్ పూర్తయింది. చిత్ర బృందం గుమ్మడికాయ కొట్టడంతో సినిమా నిర్మాణంలో కీలక దశ ముగిసింది. ఇక పోస్ట్‌ప్రొడక్షన్ పనులపై మేకర్స్ దృష్టి సారించనున్నారు.
100 శాతం పూర్తి
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. టీ-సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 19వ శతాబ్దం, బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో కథ సాగనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఇప్పటికే 100 రోజుల షూటింగ్ పూర్తి చేసి దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా మిగిలిన సన్నివేశాలను కూడా చిత్రీకరించి షూటింగ్‌ను పూర్తిచేశారు.
త్వరలో ప్రమోషన్లు
ఈ సినిమాలో రష్మిక మందన్న ‘జయమ్మ’ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమెకు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు కొనసాగనున్నాయి.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘రణబలి’ చిత్రాన్ని అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. షూటింగ్ పూర్తవడంతో త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
