Kaniparthi
* నెల రోజుల్లో 4 కొండచిలువలు
Kaniparthi: ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామంలో కొండచిలువలు వరుసగా కనిపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
గత నెల రోజుల్లో గ్రామ పరిసరాల్లో ఏకంగా నాలుగు భారీ కొండచిలువలు కనిపించినట్లు స్థానికులు తెలిపారు. వీటిలో మూడు కొండచిలువలను అటవీ శాఖ సిబ్బంది సురక్షితంగా బంధించి తరలించారు. తాజాగా ఎయిర్టెల్ టవర్ సమీపంలో మరో కొండచిలువ కనిపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు.
కొండచిలువలు తరచూ గ్రామ పరిసరాల్లోకి వస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ సరీసృపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
