Tirumala Garuda Seva
* ప్రధాన ఘట్టానికి చేరిన బ్రహ్మోత్సవాలు
ఆకేరు న్యూస్, తిరుమల : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవ నేడు సాయంత్రం వైభవంగా జరగనుంది. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
నేడు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు స్వామివారి గరుడ వాహన సేవ కొనసాగనుంది. గరుడ వాహనంపై మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. గరుడ సేవను వీక్షించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు.
గరుడ సేవ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, క్యూలైన్లు, భద్రత, తాగునీరు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ సేవను కనులారా వీక్షించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
