Chandrababu Naidu
* 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలు
ఆకేరు న్యూస్ డెస్క్, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu ) నేడు విశాఖలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు బీచ్‌రోడ్డులో నిర్వహించే ‘స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు.
అనంతరం ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద కుటుంబాలకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. మొత్తం 28,445 కుటుంబాలకు ఇంటి స్థలాలపై పూర్తిహక్కులు కల్పిస్తూ పట్టాలను అందించనున్నారు.
ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు భద్రత కల్పించే ఉద్దేశంతో స్థలాల క్రమబద్ధీకరణ చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా 11 మండలాల్లో 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించనున్నారు.
క్రమబద్ధీకరణకు సంబంధించిన స్థలాల మొత్తం విలువ సుమారు రూ.8,874 కోట్లు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. పట్టాల పంపిణీతో ఇన్నాళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న కుటుంబాలకు తమ ఇంటి స్థలాలపై పూర్తి హక్కులు లభించనున్నాయి.
సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి లబ్ధిదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
