Environment Summit in New Delhi PM Modi
* Environment Summit ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఆకేరు న్యూస్ డెస్క్, న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణపై నేడు దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. విజ్ఞాన్ భవన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో (Environment Summit) పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. పర్యావరణానికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, న్యాయవ్యవస్థ పాత్రపైనా సదస్సులో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సదస్సుకు 17 దేశాలకు చెందిన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. వివిధ దేశాల్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అనుసరిస్తున్న విధానాలు, చట్టాలు, న్యాయపరమైన చర్యలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు పర్యావరణ పరిరక్షణలో న్యాయవ్యవస్థ పాత్రతో పాటు అంతర్జాతీయ సహకారంపై చర్చలకు వేదికగా నిలవనున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
