Ratna Thanda
Ratna Thanda: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రత్న తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని తండావాసులు డిమాండ్ చేశారు. వారి డిమాండ్‌కు సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు.
లింగంపల్లి గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్న తండాలో 13 కుటుంబాలకు చెందిన సుమారు 60 మంది నివసిస్తున్నారు. సరైన రహదారి లేకపోవడంతో విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలను పొందేందుకు తండావాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పిల్లలను పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు పంపడం కూడా కష్టంగా మారిందన్నారు.మఅత్యవసర సమయాల్లో వైద్య సేవలు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తండాలో రేషన్ షాపు, అంగన్వాడీ కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని కోరారు.
సీపీఎం మద్దతు
రత్న తండాను శనివారం సందర్శించిన సీపీఎం నాయకులు సమస్యలను పరిశీలించారు. తండాకు సుమారు 2 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించడంతో పాటు రేషన్ షాపు, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు క్రమం తప్పకుండా ఆరోగ్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్, లింగంపల్లి గ్రామ శాఖ కార్యదర్శి ఆవుల ప్రభాకర్, మండల కమిటీ సభ్యులు, రైతు సంఘం నాయకులు, తండావాసులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
