Station Ghanpur
Station Ghanpur| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: సామాజిక న్యాయం, రాజ్యాధికారం లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27న హంటర్ రోడ్డులోని డి కన్వెన్షన్లో నిర్వహించనున్న బహిరంగ సభ పోస్టర్ను ఆదివారం స్టేషన్ ఘన్పూర్లో ఆవిష్కరించారు. ఐలమ్మ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చందా మల్లయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభాలో అధికంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత వాటా దక్కేందుకు సమిష్టి ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, జిల్లా కన్వీనర్ బిట్ల శివతేజ, కూరపాటి యాదగిరి, సాంబారి సత్యనారాయణ, బొద్దున రవి, చింత శ్రీనివాస్, గోవింద అశోక్, కొలిపాక రమేష్, కూరపాటి శ్రీనివాస్, జోసఫ్, మచ్చ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
