Mulugu SP
Mulugu SP| ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో ఇటీవల నీటి కుంటల్లో పడి చిన్నారులు మృతి చెందిన ఘటనల నేపథ్యంలో వ్యవసాయ క్షేత్రాల్లో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ కె. సుధీర్ రామ్నాథ్ కేకాన్ సూచించారు. పొలాలకు వెళ్లేటప్పుడు చిన్నారులను వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనివార్య పరిస్థితుల్లో తీసుకెళ్తే ఒంటరిగా వదిలిపెట్టవద్దని తెలిపారు. బావులు, కుంటలు, కాలువలు, విద్యుత్ స్తంభాలు, హైటెన్షన్ తీగల వద్ద పిల్లలు వెళ్లకుండా పర్యవేక్షించాలని కోరారు.
అదేవిధంగా గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిమజ్జనం సమయంలో చిన్నారులు, వృద్ధులు, ఈత రాని వారిని చెరువులు, కుంటల్లోకి తీసుకెళ్లవద్దని సూచించారు. వాహనదారులు నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
