Palle Rajireddy
Palle Rajireddy| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన రక్తదాత పల్లె రాజిరెడ్డి జాతీయ ఉత్తమ రక్తదాత పురస్కారం అందుకున్నారు. అధికసార్లు రక్తదానం చేసినందుకు భారత్ రక్తధాన్ సేవా మిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ బుక్ రికార్డ్ ఆఫ్ బ్లడ్ డోనర్ డాక్టర్ సంపత్ కుమార్ చేతుల మీదుగా రాజిరెడ్డి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ గౌతమ్ సంస్థ అధ్యక్షుడు కురుమేటి నవీన్ తదితరులు ఆయనను శాలువా, సన్మాన పత్రంతో సత్కరించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికసార్లు రక్తదానం చేసిన వారికి ఈ పురస్కారం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 40 సార్లు రక్తదానం చేసినందుకు రాజిరెడ్డికి ఈ జాతీయ పురస్కారం లభించింది.
రాజిరెడ్డికి జాతీయ పురస్కారం లభించడంపై కూనూరు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
