Tirupati
Tirupati| ఆకేరు న్యూస్, తిరుపతి: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో సుమారు 60 గ్రాముల బంగారం చోరీకి గురైంది. బంగారం తాకట్టు రుణాన్ని రెన్యువల్ చేసుకునేందుకు వచ్చిన ఓ మహిళకు సంబంధించిన బంగారాన్ని అప్రైజర్ పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
అప్రైజర్ బంగారాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి పరిస్థితిని గమనించినట్లు తెలుస్తోంది. న్యూస్ పేపర్‌ను అడ్డుగా పెట్టుకుని అదును చూసి బంగారాన్ని అపహరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో అనుమానిస్తున్నారు.
బంగారం కనిపించకపోవడంతో బ్యాంకు సిబ్బంది గుర్తించి మేనేజర్ గిరీష్ కుమార్‌కు సమాచారం అందించారు. అనంతరం ఆయన తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడిని గుర్తించి బంగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
