Telangana Rains
* 4 జిల్లాలకు వరద ముప్పు
* భారీ వర్షాలకు అవకాశం
ఆకేరు న్యూస్, డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ విశాఖపట్నం–కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకు 55–65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.
* 4 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరిక
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రాబోయే 24–48 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు.
* ఏపీలోనూ భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లోనూ ఆకస్మిక వరదల ముప్పు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అధికారుల సూచనలను పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
