Errabelli Dayakar Rao
* బాధిత కుటుంబాలకు పరామర్శ
Errabelli Dayakar Rao| ఆకేరు న్యూస్, దేవరుప్పుల: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో ఆయన పర్యటించారు.
ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గనుపాక శ్రీనివాస్, పానుగంటి సాయిలు, గోడిశాల సుశీల, గనుపాక ఐలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న శ్యామల సుధాకర్ రెడ్డి, దుబ్బ రాజశేఖర్, రేగుల స్వామిదాస్, రుద్రోజు యాదగిరి, నాగిళ్ల జాశివలను కూడా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, మాజీ అధ్యక్షుడు బస్వ మల్లేష్, ఏల సోమ సుందర్, చింత రవి, నల్ల ఉమేష్, దిగోజు కిషోర్ కుమార్, మండల యూత్ అధ్యక్షుడు బానోత్ నవీన్ నాయక్, గ్రామ సర్పంచ్ పానుగంటి గిరిబాబు, గ్రామ అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
