Telangana Heavy Rain
* భయపెడుతున్న ఈదురుగాలులు
* భద్రాద్రి కొత్తగూడెంలో ఆర్నాభ్ తూఫాన్ విధ్వంసం..
* మొరంపల్లి బంజరలో భయానక దృశ్యాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో పలుచోట్ల వర్షాలు, ఈదురుగాలులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో ఆర్నాభ్ తూఫాన్ ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీగా ఈదురుగాలులు వీయడంతో అక్కడి పరిస్థితులు భయానకంగా మారాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చుట్టూ చీకటి కమ్ముకోగా.. భారీగా దుమ్ము, ధూళి ఎగిసిపడింది. నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో చెట్లు, ఇంటి రేకులు గాలికి ఎగిరిపడ్డాయి.
ఈ ఘటనలో కొంతమంది మనుషులు సైతం గాలి తీవ్రతకు కొద్దిదూరం వరకు నెట్టబడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితిని చూసిన బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లోనే వాతావరణం పూర్తిగా మారిపోయిందని.. భారీ గాలులు, దుమ్ముతో ఏం జరుగుతుందో అర్థం కాలేదని చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో పలుచోట్ల వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం కొనసాగుతోంది.
View this post on Instagram
ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బలమైన గాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, నిర్మాణాల సమీపంలో ఉండకూడదని సూచిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఘటనతో మరోసారి వాతావరణ పరిస్థితుల తీవ్రత స్పష్టమైంది. వర్షాలతో పాటు అకస్మాత్తుగా వీస్తున్న బలమైన గాలులు ప్రజలను కలవరపెడుతున్నాయి. రానున్న గంటల్లో వాతావరణ పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
