NTR Baby Kit Scheme
* ఏటా 2.45 లక్షల మందికి లబ్ధి
ఆకేరు న్యూస్,అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’ అందజేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే తల్లులకు పుట్టిన శిశువుల కోసం ఈ కిట్లను అందిస్తున్నారు.
ఎన్టీఆర్ బేబీ కిట్ల కోసం ప్రభుత్వం ఏటా రూ.51.15 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది సుమారు 2.45 లక్షల మంది శిశువులకు ప్రయోజనం చేకూరనుంది.
ఒక్కో ఎన్టీఆర్ బేబీ కిట్ ధర రూ.1,400గా ఉంది. నవజాత శిశువులకు అవసరమైన వస్తువులతో కిట్లను అందజేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే కుటుంబాలకు ఆర్థిక భారం కొంత మేర తగ్గించడంతో పాటు, శిశువుల సంరక్షణకు అవసరమైన సామగ్రిని అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
