Warangal Weather Alert
Published:
* రాత్రి 11 తర్వాత వర్ష సూచన
ఆకేరు న్యూస్, వరంగల్ : హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రాత్రి 11 గంటల వరకు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం తక్కువగా ఉంది. అయితే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కొనసాగవచ్చని అంచనా.
రాత్రి 11 గంటల తర్వాత మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ సమాచారం సూచిస్తోంది.
ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జనం, ఇతర కార్యక్రమాలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షం తీవ్రతను బట్టి ప్రయాణాలు, బహిరంగ కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఈ వార్తకు సంబంధించిన బృందం

కరస్పాండెంట్
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
