Motorcycle Racing
*ప్రవీణ్‌కు విజయం అంకితం
ఆకేరు న్యూస్, జనగామ జిల్లా : ఇటీవల చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో జరిగిన ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ రేసింగ్ ఛాంపియన్షిప్–2026లో సిద్దెంకి గ్రామానికి చెందిన బీదాని రాజేందర్ ప్రతిభ కనబరిచారు.
TVS RR310 OMC Expert Category – Round 2, Race 1లో రాజేందర్ ప్రథమ స్థానంలో నిలిచి విజయం సాధించారు. జాతీయ స్థాయి మోటార్‌సైకిల్ రేసింగ్ పోటీలో విజయం సాధించడం పట్ల సిద్దెంకి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాజేందర్ సిద్దెంకి గ్రామానికి చెందిన రవీందర్ కుమారుడు. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో సాధించిన ఈ విజయాన్ని ఇటీవల మృతి చెందిన తన ఆత్మీయుడు ప్రవీణ్ అన్నకు అంకితం చేస్తున్నట్లు రాజేందర్ తెలిపారు.
“ఈ విజయం నా ప్రవీణ్ అన్నకు అంకితం. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి” అంటూ రాజేందర్ భావోద్వేగానికి గురయ్యారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గానుపాడు గ్రామానికి చెందిన కన్నెబోయిన ప్రవీణ్ కు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను అని అన్నాడు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
