CM revanth reddy
*అధికారులతో కీలక చర్చ
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : రాష్ట్ర విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు.
విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి పలు అంశాలపై చర్చించారు. ట్రాన్స్కో, జెన్కోతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, విద్యుత్ సంస్థల పనితీరు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారుల నుంచి సీఎం వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.
విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలకు సంబంధించిన అంశాలతో పాటు వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించే విధానంపైనా సమీక్షలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. శాఖలో చేపడుతున్న పనులు, పెండింగ్ అంశాలు, రాబోయే కాలంలో విద్యుత్ అవసరాలను తీర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం చర్చించినట్లు సమాచారం.
సమీక్షలో విద్యుత్ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొని శాఖకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
