Tank Bund, Hit and Run SI Venkanna
* విధుల్లో ఉన్న ఎస్ఐ మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న ఓ పోలీసు ఎస్ఐను గుర్తుతెలియని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటన విషాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ కె. వెంకన్న (55) చికిత్స పొందుతూ మృతి చెందారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ట్యాంక్‌బండ్ వద్ద క్రేన్ నంబర్ 2 సమీపంలో ఎస్ఐ కె. వెంకన్న విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ గుర్తుతెలియని ద్విచక్రవాహనం వెంకన్నను ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన వెంటనే బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. బైక్ ఢీకొనడంతో వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సహచర పోలీసులు, సిబ్బంది ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో వెంకన్న చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ ఘటనతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది. గణేశ్ నిమజ్జనం విధుల్లో ఉండగా ఎస్ఐ మృతి చెందడంతో సహచర పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెంకన్నను ఢీకొట్టి పరారైన గుర్తుతెలియని ద్విచక్రవాహనాన్ని గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం, దానిని నడిపిన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
