Tirumala Devotees Rush
* సర్వదర్శనానికి 15 గంటలు
ఆకేరు న్యూస్, తిరుపల : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
నిన్న శ్రీవారిని 67,632 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న భక్తుల్లో 24,909 మంది తలనీలాలు సమర్పించారు. మరోవైపు శ్రీవారి హుండీకి భారీగా కానుకలు వచ్చాయి. హుండీ ద్వారా రూ.2.91 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.
భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనం, క్యూలైన్ల విషయంలో టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సర్వదర్శనానికి ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో భక్తులు ఓపికగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
