Dr Bhairam Ranadheer, Penile Implant Warangal
*అంగ స్తంభన సమస్యకు ..
ఆధునిక పరిష్కారం
*ఇక సంతోష సాగరాల్లో సంసార జీవితం
*వరంగల్ లో మొదటి సారి ఆపరేషన్
డాక్టర్ రణధీర్, యూరాలజిస్ట్
ఆకేరు న్యూస్, వరంగల్ : ఆధునిక సమాజంలో దంపతుల మద్య శృంగార జీవితానికి సంబందించి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. కాలంతో పోటీ పడుతూ కొనసాగే ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత కరువవుతోంది.. ఇందులో భాగంగానే శృంగార జీవితంలో సరికొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.. ముఖ్యంగా పురుషుల్లో తలెత్తుతున్న అంగస్తంభన సమస్యకు వైద్య శాస్త్రం ఆధునిక పరిష్కారం అందిస్తోంది.. అదే పీనైల్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స.. ఇటీవలే వరంగల్ నగరంలోనూ ఈ శస్త్ర చికిత్స చేశారు.. అసలీ పీనైల్ ఇంప్లాంట్ అంటే ఏంటి…? ఎవరికీ అవసరం ఉంటుంది..? ఎంత ఖర్చవుతుంది అనే విషయాలు తెలుసుకుందాం..
* పీనైల్ ఇంప్లాంట్ అంటే..?
ప్రపంచవ్యాప్తంగా అంగస్తంభన లోపంపై ఎనిమిది దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఇటలీ 48.6 శాతంతో అత్యధికంగా నిలిచింది. భారతదేశంలో జాతీయ ప్రభుత్వ సర్వే లేకపోవడంతో ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న పరిమిత కమ్యూనిటీస్ లో 5 శాతం నుంచి 15.77 శాతం వరకు నమోదైంది. ఆసుపత్రి లేదా మధుమేహ రోగుల అధ్యయనాల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి.. ఇక పీనైల్ ఇంప్లాంట్ (Penile Implant) అంటే అంగస్తంభన సమస్యకు శస్త్రచికిత్స ద్వారా పురుషాంగం లోపల అమర్చే కృత్రిమ పరికరం. దీనిని పీనైల్ ప్రోస్థెసిస్ అని కూడా అంటారు. మందులు, ఇంజెక్షన్లు, వ్యాక్యూమ్ పంప్ వంటి చికిత్సలు పనిచేయని తీవ్రమైన Erectile Dysfunction (ED) ఉన్నవారికి సాధారణంగా చివరి దశ చికిత్సగా దీనిని సూచిస్తారు. వృషణం సంచిలో చిన్న పంప్, పురుషాంగంలో రెండు సిలిండర్లు అమర్చుతారు. పంప్‌ను చేతితో నొక్కితే ద్రవం సిలిండర్లలోకి వెళ్లి అంగస్తంభన వస్తుంది. పని పూర్తయిన తరువాత వాల్వ్ నొక్కితే మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. సహజంగా కనిపించడం వల్ల ప్రస్తుతం ఎక్కువగా ఎంపిక చేసుకునే రకం ఇదే. రెండవ రకంలో పురుషాంగంలో వంగగలిగే రెండు రాడ్లు అమర్చుతారు. సంభోగ సమయంలో పైకి, మిగిలిన సమయంలో కిందకు వంచుకోవాలి. ఉపయోగించడం సులభంగానే ఉంటుందంటున్నారు వైద్యులు . అయితే పురుషాంగం ఎప్పుడూ కొంత గట్టిగానే ఉండడం అనేది ఒక సమస్యగా చెబుతున్నారు.
* ఎవరికి అవసరం ఉంటుందంటే..?
పీనైల్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స ఎవరికి పడితే వారికి చేసే అవకాశం ఉండదు. అంగస్తంభన సమస్యకు అన్ని రకాల చికిత్సలు చేసినప్పటికీ ఫలితం లేక పోతే.. చివరి అవకాశంగా ఈ పీనైల్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స చేస్తారని వైద్యులు అంటున్నారు.. అంటే వయాగ్రా తరహా మందులు పనిచేయకపోవడం, మధుమేహం కారణంగా తీవ్రమైన అంగస్తంభన లోపం రావడం, ప్రోస్టేట్ క్యాన్సర్ శస్త్రచికిత్స లేదా రేడియేషన్ తర్వాత వచ్చే అంగస్తంభన లోపం.. వెన్నుపాము లేదా పెల్విక్ నరాల గాయం , పెరోనీస్ జబ్బు ( Peyronie’s disease ) అంటే పురుషాంగం లోపల గట్టిగా ఉండే మచ్చ కణజాలం ( scar tissue ) లేదా plaque ఏర్పడటం. అంగస్తంభన వచ్చినప్పుడు ఆ ప్రాంతం మిగతా భాగంలా సాగకపోవడంతో పురుషాంగం వంగిపోతుంది. దీంతో పాటు తీవ్రమైన వంకర, అంగస్తంభన సమస్యవాళ్ళకు పీనైల్ ఇంప్లాంట్ చికిత్స చేస్తారు.. అదే విదంగా అంగ స్తంభన సమస్య ఇంజెక్షన్లు, వ్యాక్యూమ్ పరికరాలు విఫలమయితే ఈ చికిత్సను ఆశ్రయిస్తారు.. అదే విదంగా మానసిక ఒత్తిడి వల్ల మాత్రమే అంగ స్తంభన సమస్య ఉన్నవారికి ఇది మొదటి చికిత్స కాదంటున్నారు వైద్యులు..
* సహజ అనుభూతి ఉంటుంది..
– డాక్టర్ భైరం రణధీర్, యూరాలజిస్ట్.
భైరం హాస్టిటల్ , హనుమకొండ
అంగ స్తంభన సమస్యకు చివరి పరిష్కారంగా పీనైల్ ఇంప్లాంట్ చికిత్స చేస్తాం.. ఇంప్లాంట్ శస్త్ర చికిత్స తర్వా త రెండు రోజుల్లో డిస్ చార్జ్ చేస్తాం. ఈ ఇంప్లాంట్ చిన్న బటన్ ఆన్ ఆఫ్ ద్వారా పని చేస్తుంది.. ఆరు వారాల తర్వాత సంసార జీవితంలో పాల్గొన వచ్చు.. సహజమైన అనుభూతి ఉంటుంది.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.. వరంగల్ లో ఇదీ మొదటి సారి ఆపరేషన్ చేశాం.. హైదరాబాద్‌లో చాలా కాలంగానే ఈ ఆపరేషన్లు చేస్తున్నారు.
—

Please tell us what is wrong. Your report will be sent to the website team.
