Padi Kaushik Reddy
* తెలంగాణ మీ అయ్య జాగీరా
* నిమజ్జనంలో పాటలు పెడితే కేసులా?
ఆకేరు న్యూస్, హైదరాబాద్: వినాయక నిమజ్జన వేడుకలు మరియు డీజే పాటల నిబంధనలపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. తాజాగా పోలీసులు తీసుకున్న కొన్ని చర్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఐపీఎస్ అధికారి, సీపీ సజ్జనార్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. నిమజ్జన వేడుకల్లో యువకులు ఉత్సాహంగా పాటలు పెట్టుకుంటే కేసులు పెట్టి వేధిస్తారా అని కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy) ప్రశ్నించారు.
యువతను అక్రమ కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని ఆయన హితవు పలికారు. “తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?” అంటూ ఆయన తీవ్ర పదజాలంతో పోలీసుల తీరును తప్పుబట్టారు. ప్రభుత్వ అధికారులైన వారు నిబంధనల పేరుతో ప్రజల మనోభావాలను దెబ్బతీయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా అధికారుల పదవీకాలంపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని, రెండేళ్లలో రిటైర్ అవుతామని అనుకుంటున్నారా అంటూ హెచ్చరించారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టమని, “సప్త సముద్రాల అవతలున్నా సరే పట్టుకొస్తాం” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పోలీసు వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
