Tollywood Dancers Association President Somalatha
* జనరల్ బాడీలో దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: డ్యాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో తనపై దాడి జరిగిందంటూ అసోసియేషన్ అధ్యక్షురాలు సోమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమావేశం జరుగుతున్న సమయంలో కొందరు తనపై దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
* వివరాలు సేకరణ
ఈ ఘటనతో సమావేశంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సోమలత పోలీసులను కోరినట్లు సమాచారం. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అసోసియేషన్ కు సంబంధించిన ఫైల్స్ కూడా కొందరు తీసుకెళ్లినందుకు ముద్దొస్తుగానే ప్లానింగ్ రూపొందించుకొని వచ్చారని ఆమె ఆరోపించారు.
* పోలీసుల విచారణ
అసోసియేషన్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశాలు ఈ వివాదానికి కారణమా? అనే కోణంలోనూ వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
