Softball Player
* చైనా అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీకి సాయి వర్షిణి
ఆకేరు న్యూస్, హనుమకొండ : హనుమకొండకు చెందిన యువ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి వేల్పుల సాయి వర్షిణి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
హనుమకొండలోని Greenwood High Schoolలో 8వ తరగతి చదువుతున్న సాయి వర్షిణి గత నాలుగు సంవత్సరాలుగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కోచ్ పొలెపాక వినయ్ కుమార్ ఆధ్వర్యంలో సాఫ్ట్‌బాల్‌లో శిక్షణ పొందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన ఆమె, వరంగల్‌లో , మెదక్‌లో , నిజామాబాద్‌లో రాష్ట్రస్థాయి మీట్స్‌లో పాల్గొంది.
అదేవిధంగా ఔరంగాబాద్‌లో అండర్-15 బాలికల జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న సాయి వర్షిణి, అనంతరం 5వ ఆసియా కప్ ఎంపిక ట్రయల్స్‌లో2026 పాల్గొంది. మహారాష్ట్రలోని కోపర్గావ్లో ఉన్న సంజీవని యూనివర్సిటీలో జూలై 24, 25 తేదీల్లో జరిగిన ఎంపిక ట్రయల్స్ ద్వారా అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.
* అంతర్జాతీయ పోటీకి ముందు శిక్షణ శిబిరాలు
ఆసియా కప్‌కు సన్నాహకంగా సాయి వర్షిణి వివిధ శిక్షణ శిబిరాల్లో పాల్గొంటోంది.
ఆగస్టు 24 నుంచి 26 వరకు – చావన్ గ్రౌండ్, ఇండోర్‌లో శిక్షణ శిబిరం
సెప్టెంబర్ 8 నుంచి 13 వరకు – సంజీవని యూనివర్సిటీ, కోపర్గావ్, మహారాష్ట్రలో శిక్షణ శిబిరం
అక్టోబర్ 6 నుంచి 10 వరకు – కల్యాణి, నదియా జిల్లా, పశ్చిమ బెంగాల్లో ఫైనల్ క్యాంప్
అనంతరం అక్టోబర్ 12 నుంచి 18 వరకు చైనాలోని వూషి (Wuxi) నగరంలో జరగనున్న అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్లో సాయి వర్షిణి పాల్గొననుంది.
సాయి వర్షిణి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న తెలంగాణ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ డా. పిల్లి సాంబశివరావు, హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి టాబేటి రాజేందర్, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తిలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న సాయి వర్షిణి భవిష్యత్తులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మరిన్ని విజయాలు సాధించాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
