తెలంగాణ హైకోర్టు
Published:
Updated: 27 Jul 2024 • 01:11 PM
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) పార్టీలు మారారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) లో శనివారం విచారణ జరిగింది. కోర్టులో కడియం (Kadiam), దానం నాగేందర్ (Dana Nagender) తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని వారు వాదించారు. గతంలోని పలు కోర్టుల తీర్పులను చదివి వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.
————————–
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
