Milad Un Nabi Station Ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
కులాలు, మతాలు, ప్రాంతాలు వేరైనప్పటికీ అందరూ శాంతి, సహనంతో మెలగాలని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీ బాబా అన్నారు. ‘మిలాద్ ఉన్ నబి’ సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధి శివుని పల్లి మసీదులో బుధవారం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శాంతి, సామరస్యంతో పండగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెహమాన్, హమీద్, అఫ్జల్, ఇలియాస్, అష్రఫ్, ఫయాజ్, రఫర్, మున్వర్ తదితరులు పాల్గొన్నారు.
* “లయన్స్ క్లబ్ ఆఫ్ శివునిపల్లి ఆధ్వర్యంలో “
పొత్కనూరి అశోక్, శ్రావణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి సహకారంతో శివునిపల్లి బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర 100 మందికి అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు తుమ్మనపల్లి రవి కిరణ్, కార్యదర్శి పులి వినయ్ కుమార్, గౌరిశెట్టి అనిల్ క్లబ్ సభ్యులు చిలువెరు నాగేశ్వరరావు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
