Sandeep Reddy Vanga about Spirit
* సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ పై ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం లేదని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. సినిమాలోని హింసాత్మక, తీవ్ర స్థాయి కంటెంట్ కారణంగా ‘స్పిరిట్’కు ఏ సర్టిఫికెట్ రావడం ఖాయమని ఆయన వెల్లడించారు.
భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై తాను, తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా సమర్పిస్తున్న ‘రొమాంచకం’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ గురించి మాట్లాడారు. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
* స్పిరిట్, వారణాసి మధ్య 37 రోజుల గ్యాప్
‘స్పిరిట్’ విడుదల తేదీకి మరో భారీ చిత్రం ఎస్ఎస్ రాజమౌళి–మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ విడుదలకు మధ్య దాదాపు 37 రోజుల గ్యాప్ ఉంది. ‘స్పిరిట్’ మార్చి 5న విడుదల కానుండగా, ‘వారణాసి’ ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది.
ఈ రెండు భారీ చిత్రాలు అతి తక్కువ వ్యవధిలో విడుదల కావడంపై సందీప్ రెడ్డి వంగాను ప్రశ్నించగా.. ఈ గ్యాప్ సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. “ఇది సరిపోతుంది. దాదాపు 37 రోజుల గ్యాప్ ఉంది. అంతేకాదు, ‘వారణాసి’ సినిమా ‘స్పిరిట్’ కంటే పెద్దది” అని సందీప్ రెడ్డి వంగా అన్నారు.
* నవ్వులు పూశాయి..
ఈ రెండు సినిమాల విడుదల తేదీల గురించి మరోసారి ప్రశ్నించగా, ప్రశ్న అడిగిన వ్యక్తి ‘వారణాసి’ కోసం ‘స్పిరిట్’ను తప్పుకోవాలని కోరుకుంటున్నట్టుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన సమాధానంతో కార్యక్రమంలో నవ్వులు పూశాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
