NTR District Crime
NTR District Crime: ఆకేరు న్యూస్, డెస్క్: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో మహిళ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం.. భవానీపురానికి చెందిన షఫికి, ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన కళ్యాణితో వివాహేతర సంబంధం ఉంది. కళ్యాణి కుమారుడిని కూడా షఫి పెంచుతున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా డబ్బులు ఇవ్వాలని కళ్యాణి షఫిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 17న రూ.20 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో షఫి కళ్యాణిని భవానీపురంలోని తన ఇంటికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు తన మటన్ షాపులో పనిచేసే గురువులు అనే వ్యక్తి సహకారం తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి బ్యాగులో పెట్టి గొల్లపూడి సమీపంలోని కూలింగ్ కెనాల్లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా, కళ్యాణితో సన్నిహితంగా ఉన్న మరికొందరి పాత్రపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కెనాల్లో పడేసిన మృతదేహ భాగాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
