Chakali Ilamma Jayanthi
Chakali Ilamma Jayanthi| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ, మండలంలోని పలు గ్రామాల్లో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తాటికొండలో..
తాటికొండ గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మారుపాక సృజన శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎడమ కట్టమలు, పంచాయతీ సభ్యులు, రజక సంఘం నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో..
స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కౌన్సిలర్లు పొన్న రాజేష్, పున్న రవి, బొల్లు లక్ష్మి, అంగిడి రజిత, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
రజక సంఘం ఆధ్వర్యంలో..
మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం నాయకులు, సభ్యులు, కౌన్సిలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
చాగల్‌లో..
మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లోనూ చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పున్న రాజేష్‌తో పాటు పొన్న రవీందర్, రాజయ్య, లొంక రమేష్, రాంబాబు, సాజీద్, ధనంజయుడు, రంగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
