Kavitha
* వైద్య రంగంపై ఫైర్..
* కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Kavitha| ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మృతి ఘటనపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. 2020-21లో 6,239 మంది, 2022-23లో 4,933 మంది, 2024-25లో 3,853 మంది చిన్నారులు మృతి చెందినట్లు గణాంకాలు వెల్లడించారని తెలిపారు. హైదరాబాద్‌లోనే గతేడాది 1,046 మంది చిన్నారులు మృతి చెందారని పేర్కొన్నారు.
వైద్య బడ్జెట్‌పై విమర్శలు
వైద్య రంగానికి బడ్జెట్లో 10 శాతం కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం సుమారు 5 శాతం మాత్రమే కేటాయించిందని కవిత విమర్శించారు. గతేడాది రూ.13,192 కోట్లు కేటాయించగా రూ.9,242 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోయాయని ఆరోపించారు.
కలెక్టర్లకు ప్రశ్నలు
ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టళ్లను జిల్లా కలెక్టర్లు ఎందుకు సందర్శించడం లేదని కవిత ప్రశ్నించారు. నిమ్స్‌లో బెడ్ దొరకడం కష్టంగా ఉందని, సర్జరీలకు నెలల తరబడి సమయం పడుతోందని అన్నారు. నీలోఫర్‌లో బెడ్ ఆక్యుపెన్సీ అధికంగా ఉందని పేర్కొన్నారు. పాఠశాలల్లో బాలికలకు కనీస టాయిలెట్ సదుపాయాలు కూడా లేవని విమర్శించారు.
ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీ
రాబోయే ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో తెలంగాణ రక్షణ సేన తరఫున అభ్యర్థిని బరిలోకి దింపుతామని కవిత తెలిపారు. SIR ప్రక్రియలో క్లరికల్ తప్పిదాల కారణంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. తన ఫామ్‌హౌస్ భూమిపై వస్తున్న ఆరోపణలను కూడా ఆమె ఖండించారు. తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఆస్తి ఉన్నట్లు నిరూపిస్తే ఆస్తిని రాసిచ్చేస్తానని సవాల్ చేశారు. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
