Ramayana
* రామాయణం మ్యూజికల్ జర్నీ షురూ
* శ్రీరాముడి భక్తి భావాన్ని చాటే పాట
Ramayana| ఆకేరు న్యూస్, సినిమా: బాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం రామాయణం మ్యూజికల్ జర్నీ ప్రారంభమైంది. ఈ సినిమాలోని తొలి పాట జై జై రామ్ తెలుగు వెర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. శ్రీరాముడి భక్తి, కరుణ, ధర్మాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. రాకేందు మౌళి తెలుగు సాహిత్యం అందించారు. దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ ఆలపించారు. ‘జై జై రామ్’ అనే నామస్మరణ పదే పదే వినిపించేలా రూపొందించిన ఈ పాటలో ఆధ్యాత్మికతతో పాటు సినిమాటిక్ మ్యూజిక్‌ను మేళవించారు.
పాటపై ఫిల్మ్‌మేకర్, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. శ్రీరాముడు రామాయణంకు హృదయమని తెలిపారు. కష్ట సమయాల్లో బలాన్ని, అనిశ్చితిలో మార్గాన్ని, ఆనంద సమయంలో కృతజ్ఞతను అందించే వ్యక్తిగా శ్రీరాముడిని భావిస్తామని పేర్కొన్నారు. జై జై రామ్ పాట ద్వారా భక్తి, భావోద్వేగం, విలువలను ప్రేక్షకులకు అందించాలనుకున్నామని చెప్పారు. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. శ్రీరాముడి నామస్మరణే ఈ పాటకు ప్రధాన బలమని అన్నారు. ప్రార్థనలోని స్వచ్ఛత, ఆత్మీయతను కాపాడుతూనే సినిమాటిక్ అనుభూతిని అందించేలా పాటను రూపొందించినట్లు తెలిపారు.
రాకేందు మౌళి మాట్లాడుతూ.. జై జై రామ్ మూడు సులభమైన పదాలే అయినప్పటికీ వాటిలో సంపూర్ణమైన ప్రార్థన ఉందన్నారు. ప్రతి భక్తుడికి శ్రీరాముడితో ఉన్న అనుబంధాన్ని ఈ పాటలో వ్యక్తీకరించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఇటీవల విడుదలైన రామాయణం ట్రైలర్‌కు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. మేకర్స్ ప్రకారం.. ట్రైలర్ ఆరు రోజుల్లోనే అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కలిపి ఒక బిలియన్ వ్యూస్ దాటింది.
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవీ దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ‘రామాయణం పార్ట్ వన్’ 2026 దీపావళికి థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
