Palakurthi
Palakurthi| ఆకేరు న్యూస్, పాలకుర్తి: సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనను రాజకీయ అంశంగా మార్చడం సరికాదని పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగు శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాస్టల్ ఎదుట ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
హాస్టల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ గేటు ముందు ధర్నా చేయడం సరికాదని పోగు శ్రీనివాస్ అన్నారు. విద్యార్థుల సమస్యలపై నిజంగా శ్రద్ధ ఉంటే వారి బాధలను అర్థం చేసుకుని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని అన్నారు.
నరేందర్ పవర్ విమర్శలు
ఈ సందర్భంగా జనగామ డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి, ఉస్మానియా ఉద్యమకారుడు డాక్టర్ నరేందర్ పవర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలనలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను సందర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం హాస్టల్ ఎదుట ధర్నా చేయడం సమంజసం కాదని అన్నారు.
విద్యార్థుల సమస్యలు ఉంటే వాటిని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని, హాస్టళ్లను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, ఏటీఎం చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, మార్కెట్ చైర్మన్ లావుడియా మంజుల భాస్కర్, మాజీ దేవస్థానం చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, కమ్మగాని నాగయ్య, పెనుగొండ రమేష్, ఎక్స్ ఎంపీపీ యాక సోమయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కారుపోతుల శ్రీనివాస్, సర్పంచులు బేతి కుమారస్వామి, బొడిగె ప్రదీప్ కుమార్, ఈరవెన్ను సర్పంచ్ కుమారస్వామి, గుగులోత్ కిషన్‌తో పాటు పలువురు మండల, జిల్లా నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
