Rohit Virat Partnership
Rohit Virat Partnership| ఆకేరు న్యూస్, డెస్క్: భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డేలో స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేశారు. విండీస్‌పై ఇప్పటివరకు కలిసి 15 వన్డేల్లో 982 పరుగులు చేసిన ఈ జోడీ.. మరో 18 పరుగులు చేస్తే 1,000 పరుగుల మైలురాయిని చేరుకుంటుంది.
విండీస్‌పై తొలి జోడీగా..
వన్డే క్రికెట్లో ఇప్పటివరకు 23 జోడీలు వేర్వేరు జట్లపై 1,000కుపైగా పరుగులు సాధించాయి. అయితే వెస్టిండీస్‌పై ఈ ఘనత సాధించిన జోడీ ఇప్పటివరకు లేదు. రోహిత్-కోహ్లీ జోడీ విండీస్‌పై 15 మ్యాచ్‌ల్లో 982 పరుగులు చేసింది. ఇందులో నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు, రెండు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. వీరి అత్యధిక భాగస్వామ్యం 246 పరుగులు.
వ్యక్తిగతంగానూ రికార్డులు
వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీ 41 ఇన్నింగ్స్‌ల్లో 2,261 పరుగులు చేసి, ఆ జట్టుపై అత్యధిక వన్డే పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ 35 ఇన్నింగ్స్‌ల్లో 1,613 పరుగులు సాధించారు. తొలి వన్డేలో మరో 12 పరుగులు చేస్తే.. పాకిస్థాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా రికార్డును రోహిత్ అధిగమించే అవకాశం ఉంది. మొత్తంగా తొలి వన్డేలో రోహిత్, విరాట్ కలిసి మరో 18 పరుగులు చేస్తే.. వెస్టిండీస్‌పై వన్డేల్లో 1,000 పరుగులు సాధించిన తొలి జోడీగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
