Nagarjuna
Nagarjuna| ఆకేరు న్యూస్, సినిమా: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అక్టోబర్ 2, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.
తాజాగా ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’ వీకెండ్ ఎపిసోడ్లో సందీప్ కిషన్‌తో కలిసి జేసన్ సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున అక్కినేని.. జేసన్‌ను అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమాలకు లభించిన ఆదరణను గుర్తుచేశారు.
తెలుగు ప్రేక్షకులు చాలా ఓపెన్‌గా ఉంటారని, విజయ్ సినిమాలను వారు ఎంతో ఆదరిస్తారని నాగార్జున పేర్కొన్నారు. అదే ప్రేమను జేసన్ సంజయ్‌కు, ‘సిగ్మా’ సినిమాకు కూడా అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. నాగార్జున ప్రశంసలపై జేసన్ సంజయ్ స్పందిస్తూ.. ఆయనలాంటి వ్యక్తి నుంచి ఈ మాటలు రావడం చాలా గొప్పగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు.
జేసన్‌ను ప్రశంసించిన చిరంజీవి
ఇటీవల జరిగిన ‘సిగ్మా’ ప్రమోషనల్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా జేసన్ సంజయ్‌ను ప్రశంసించారు. 1993-95 సమయంలో విజయ్ ఎలా కనిపించేవారో జేసన్ అచ్చం అలాగే ఉన్నాడని అన్నారు. నటనకు బదులుగా దర్శకత్వాన్ని ఎందుకు ఎంచుకున్నావని తాను అడిగినట్లు చిరంజీవి తెలిపారు.
చిన్నప్పటి నుంచే కథలు రాయడం, దర్శకత్వం చేయడంపై ఆసక్తి ఉండటంతో ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు జేసన్ చెప్పారని చిరంజీవి వెల్లడించారు. దీంతో ‘సిగ్మా’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
