Ramayana
Ramayana: ఆకేరు న్యూస్, సినిమా: బాలీవుడ్లో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ **‘రామాయణం’**పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.
తాజాగా రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, రవి దూబేలకు సంబంధించిన కొత్త క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేసింది. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపిస్తున్నారు.
ప్రతి పాత్రకు తగ్గట్టుగా రూపొందించిన ఈ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నటీనటుల లుక్స్, కాస్ట్యూమ్స్, పోస్టర్లలోని విజువల్స్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, పలువురు అభిమానులు ‘Magnificent’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తాజా పోస్టర్లతో ‘రామాయణం’పై అంచనాలు మరింత పెరిగాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
